నీకు తలకాయ వుందా... ఎప్పుడూ వాట్సాప్‌తోనా... భార్య మందలింపుకు భర్త సూసైడ్
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (17:08 IST)
నిరంతరం వాట్సాప్, ఫేస్‌బుక్‌లతో గడుపుతన్న భర్తను.. మీకసలు తలకాయ వుందా... ఎప్పుడూ ఎప్పుడూ వాట్సాప్‌తోనే ఉంటారా? అని భార్య మందలించడంతో భర్త ఆత్మహత్యా చేసుకున్న ఘటన పలువురిని కలచివేసింది.
సికింద్రాబాద్‌కు చెందిన శివకుమార్‌కు గత నెల 15వ తేదీన వివాహం జరిగింది. ఐతే.. నిరంతరం వాట్సాప్ చాటింగ్‌తో శివకుమార్ బిజీగా ఉండడంతో భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడ్డారు.
వాట్సాప్‌కు పూర్తిగా అడిక్ట్ అయ్యారనీ, అది వదలకపోతే కుటుంబ సభ్యులకు చెబుతానని భార్య హెచ్చరించింది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన శివకుమార్ ఆత్మహత్యా చేసుకున్నాడు.