హైదరాబాద్ నగరంలో హత్యా నేరాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న నిశ్చితార్థం కుదుర్చున్న యువకుడు తన ప్రేయసిని హత్య చేసిన ఘటన మరవక ముందే.. సోమవారం ఓ కిరాతకుడు కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను పొట్టనపెట్టుకున్నాడు. ఇందుకు కారణం ఆర్థిక ఇబ్బందులేనని.. అందుకే భార్యాపిల్లలను చంపేసి పోలీసుల ముందు లొంగిపోయాడట.
వివరాల్లోకి వెళితే.. అమీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల జిల్లెలగూడ సుమిత్ర ఎన్‌క్లేవ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన హరీందర్‌గౌడ్ అనే వ్యక్తి తన భార్య జ్యోతి, ఆరేళ్ల కుమారుడు అభిజిత్, నాలుగేళ్ల కుమార్తె సహస్రలను గొంతు నులిమి చంపేశాడు. ఇక భార్యను గోడకేసి బలంగా కొట్టి చంపేశాడు. అమీర్‌పేట పోలీసులకు లొంగిపోయాడు.