తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన ఓ మహిళ భర్త అర్థాంతరంగా తనువు చాలించడంతో మన్సూరాబాద్ డివిజన్‌లో ఒంటరిగా నివసిస్తోంది. అయితే, ఆమెకు అదే మండలానికి చెందిన నారంబాబు గౌడ్‌కు గతంలో పరిచయం ఉండేది. ఈ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని వివాహేతర సంబంధం పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేయసాగాడు.
అతడి వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని జైలుకు పంపారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన నారంబాబు పెద్దమనుషుల సమక్షంలో ఆమె వెంటపడడని హామీ ఇచ్చాడు. అయినప్పటికీ తీరు మార్చుకోని నిందితుడు ఈ నెల 18న మరోమారు బాధితురాలి ఇంటికి వెళ్లి వేధించాడు. వివాహేతర సంబంధానికి ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు వెంట తెచ్చుకున్న కల్లుగీసే కత్తితో ఆమెపై దాడిచేశాడు.
దీంతో షాక్‌కు గురైన బాధితురాలు అరవడంతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాధితురాలు తనకు మూడు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని, అడగడానికి వెళ్తే దుర్బాషలాడిందని, అందుకే ఆమెపై దాడిచేశానని నిందితుడు తెలిపాడు.