వరల్డ్ బ్యాడ్మింటన్ పోటి తుది ఫోరులో విశ్వవిజేతగా నిలిచిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హైదరాబాద్ నగరానికి చేరుకుంది. తొలుత ఢిల్లీకి చేరుకున్న ఆమె మొదట కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజును ఆమె కలుసుకుంది. ఈ సందర్భంగా సింధును అభినందించిన రిజిజు, సింధు స్ఫూర్తితో మరింత మంది బ్యాడ్మింటన్ క్రీడలోకి ప్రవేశించాలని పిలుపునిచ్చారు.
ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్న సింధు, అటునుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. ఇక్కడ ఆమెకు ఘనస్వాగతం పలుకనున్నారు. విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ఆమెను గచ్చిబౌలి వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.
కాగా, ఏకపక్షంగా సాగిన ఫైనల్ పోరులో గెలిచి, వరల్డ్ బ్యాడ్మింటన్ గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకుని తొలి భారతీయురాలిగా సింధూ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్‌కు చేరుకునే సింధూకు రాష్ట్ర బ్యాడ్మింటన్ ఫెడరేషన్‌తో పాటు, అభిమానులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.