ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌కు చెందిన సంధ్యా సింగ్ (28)కు మేజర్ విశాల్‌కు 2015, సెప్టెంబర్‌లో వివాహం జరిగింది. వివాహం సందర్భంగా భారీగానే కట్న కానుకలు ఇచ్చారు. ఆపై హైదరాబాద్‌కు వచ్చిన దంపతులు బొల్లారంలో నివశిస్తూ వచ్చారు. సంధ్యా సింగ్ రేడియో జాకీగా రాణిస్తూ వచ్చింది.ఈ క్రమంలో సంధ్యాసింగ్ కొద్ది రోజుల క్రితం తన బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా, సంధ్యాసింగ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మేజర్ విశాల్ వైభవ్, అతడి తల్లిపై మృతురాలి సోదరి ఉమాసింగ్ బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక, సంధ్యా సింగ్‌ను ఆమె భర్త, అత్త తరచూ డబ్బులు కావాలని వేధించే వారని పేర్కొన్నారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇందులోభాగంగా, విశాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించేందుకు రక్షణశాఖ అధికారుల అనుమతి కోరారు. అంతలోనే విశాల్ వైభవ్ గుండెపోటు వచ్చిందంటూ రక్షణశాఖ ఆస్పత్రిలో చేరాడు.