చదువు రాలేదు.. ఒత్తిడి.. మమ్మీ చనిపోతున్నా.. 35వ అంతస్థు నుంచి దూకేశాడు..

బుధవారం, 27 సెప్టెంబరు 2023 (17:16 IST)
ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన సురేష్ కుమార్ రెడ్డి- స్వప్నారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరి పెద్ద కుమారుడు రాయంత్ రెడ్డి (14) హైదరాబాదు కాచిగూడ ప్రాంతంలో అంతర్జాతీయ పాఠశాలలో 10వ తరగతి చదువుతూ వచ్చాడు.
 
కొడుకులు ఇద్దరూ హైదరాబాదులో చదువుకోవడం వల్ల గత 4 సంవత్సరాల క్రితం సురేశ్‌కుమార్ రెడ్డి తన కుటుంబంతో పాటు హైదరాబాదు గచ్చిబౌలి ప్రాంతంలో ఇళ్లు తీసుకున్నారు. 
 
అయితే రాయంత్ రెడ్డికి చదువు అంతగా అబ్బలేదు. చదువు అబ్బలేదనే నిరాశతో మంగళవారం రాత్రి 8.30 గంటలకు రాయంత్ రెడ్డి తన సెల్‌ఫోన్‌లో సమాచారాన్ని పంపాడు. చదువు రాలేదని.. దీంతో బతకడం ఇష్టం లేదని.. అవమానం కారణంగా ఆత్మహత్య చేసుకోబోతున్నానని పంపాడు. దీన్ని చూసి షాక్ అయిన అతని తల్లి కుమారుడి కోసం రాత్రంతా వెతికారు. 
 
రాయంత్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు. దీంతో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రాయంత్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం ఓ ఎత్తైన భవనం కింద రాయంత్ రెడ్డి చనిపోయి వుండటాన్ని గమనించారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో రాయంత్ రెడ్డి తన కుటుంబం నివాసం వుంటున్న భవనం 35 అంతస్థు నుంచి కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు