పెట్రోల్ బంకుల్లో పాత నోట్లు తీసుకోవట్లేదా...? 188876 28835 టోల్‌ఫ్రీ నెంబరుకి కాల్ చేయండి

సోమవారం, 21 నవంబరు 2016 (12:51 IST)
న్యూఢిల్లీ :  దేశంలో నోట్ల కొర‌త‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్ బంకుల్లో కూడా పాతనోట్లు మార్చుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. రద్దు చేసిన రూ.500, రూ.1,000 నోట్లు పెట్రోల్ బంకుల్లో, హాస్పిటల్స్‌లో చెల్లుతాయని పేర్కొంది. కానీ, చాలాచోట్ల పెట్రోలు బంకులు, ఆసుప‌త్రుల్లో పాత నోట్ల‌ను తీసుకోం పొమ్మంటున్నారు. ఇది స‌రికాద‌ని, ఒకవేళ ఈ నోట్లను పెట్రోల్ బంకుల్లో అంగీకరించకపోతే 18887628835అనే టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చని ఉన్న‌తాధికారులు తెలిపారు. 
 
ఈ నెంబర్‌కి ఏ ఫోన్ నుండైనా కాల్ చేయవచ్చని తెలిపారు. ఈ నెంబర్ టోల్ ఫ్రీ కాబట్టి కాల్ చేసినవారికి ఎలాంటి ఛార్జీలు పడవని ప్రకటించారు. కేంద్ర ప్ర‌భుత్వం త‌ర్వాతి నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించేవ‌ర‌కు ఏ బంకు వారు అయినా పాత నోట్లు స్వీక‌రించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి