తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక

గురువారం, 26 ఆగస్టు 2021 (09:23 IST)
కరోనా కారణముగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు దర్శనానికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటని అతితక్కువగా విడుదల చేస్తున్నారు ఈ కారణం చేత ప్రతి నెల విడుదల చేసే దర్శనం కోట కేవలం ఒక గంట వ్యవధిలోనే పూర్తి అయిపోతుంది.

దీనివల్ల ప్రతి శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు ప్రతిరోజు కేవలం ఎనిమిది వేల టిక్కెట్లు మాత్రమే దేవస్థానం వారు విడుదల చేస్తున్నారు. దీని వలన దేశం నలుమూలల నుండి శ్రీవారి దర్శన్  ప్రతివారికి దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉండటం లేదు. ఆన్లైన్ సాంకేతిక కారణాల వలన చాలామంది భక్తులకు దర్శనం టికెట్లు లభించడం లేదు 
 
తిరుమల తిరుపతి దేవస్థానం వారు కోవిద్-19 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను అనుసరించి అతి తక్కువ కోటా ను విడుదల చేస్తున్నారు.
 
తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ virual ఆర్జిత సేవలను సంబంధించిన టిక్కెట్లను విడుదల చేశారు ఈ వివరములు
1. కళ్యాణోత్సవం. ఆర్జితసేవ రుసుము₹1000 ఈ సేవ బుక్ చేసుకున్న శ్రీవారి భక్తులను ఇద్దరిని ఉచితముగా దర్శనమునకు అనుమతిస్తారు
2. ఆర్జిత బ్రహ్మోత్సవం
3. సహస్ర దీపాలంకరణ సేవ
4.ఉంజల్ సేవ
ఈ ఆర్జిత సేవలు రుసుము  ₹500
ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న శ్రీవారి భక్తుల ను ఒకరిని ఉచితముగా దర్శనమునకు అనుమతిస్తారు.
 
పైన వివరించిన అర్జిత సేవలు అన్నియు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. శ్రీవారి భక్తుల ను ఎవరిని ప్రత్యక్షంగా అనుమతించరు.
 
ఈ ఆన్లైన్ ఆర్జిత సేవ టిక్కెట్లు సంబంధించినది దర్శనం తిరుమల తిరుపతి దేవస్థానం వారు  అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ది.21 అక్టోబర్2021. నుండి  ది.31 మార్చి 2022 వరకు విడుదల చేశారు కావున  ముందస్తు ప్రణాళిక ద్వారా తిరుమల వెళ్లే శ్రీవారి యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకోవలసిందిగా మనవి.
 
ప్రతి నెల విడుదల అయ్యే ₹300 ప్రత్యేక ప్రవేశం టికెట్ల కోట  కాకుండా ఈ ఉచిత సేవ టికెట్లు ను బుక్ చేసుకున్నచో అతి సులువుగా మీకు శ్రీవారి దర్శనం అందుబాటులో ఉంటుంది. ఏ విధమైన ఇబ్బంది లేకుండా శ్రీ స్వామివారికి దర్శనం లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు