వీరిలో 794 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉండగా, 1004 మంది ఎస్జీటీలు, పీఇటీలు, లాంగ్వేజ్ పండిట్లు ఉన్నారు. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో వారి కాంట్రాక్ట్ సర్వీసును పొడిగిస్తుండగా ఈ ఏడాది కొన్ని సాంకేతిక కారణాలతో సీఆర్టీల సర్వీసు పొడిగింపును అధికారులు నిలిపివేసారు.
దీంతో పలు పాఠశాలల్లో ఇబ్బందులు తలెత్తడం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే సీఆర్టీలు తమ సమస్యను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సీఆర్టీల సమస్య గురించి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి గత వారం జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.