ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. బ్యారేజ్ నీటిమట్టం 9.65 అడుగులకు పెరిగింది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 7,200 క్యూసెక్కుల సాగునీటిని జలవనరుల శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు.
దాదాపు లక్షా 28 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు జలదిగ్భందంలో ఉండిపోయాయి.
పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పునరావాస కాలనీలు, మైదాన ప్రాంతాలకు ముంపు గ్రామాల ప్రజలు తరలిపోతున్నారు.