ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో జరిగిన 2021 బీడబ్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్ రజత పతకం సాధించాడు. శ్రీకాంత్‌ను ఘనంగా సన్మానించిన సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వం తరపున రూ. 7 లక్షల నగదు బహుమతి, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా శ్రీకాంత్ విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ కార్యక్రమంలో టూరిజం, క్రీడా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి, శాప్ ఎండీ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి, శాప్ ఓఎస్డీ రామకృష్ణ, శ్రీకాంత్ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్ కృష్ణ పాల్గొన్నారు.