కర్నూలు ఎం.డి.ఓ ను తక్షణమే సస్పెండ్ చేయాలని యస్సీ, యస్టీ, బిసీ , మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు.
స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు యస్సీ, యస్టీ , బిసీ, మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో గార్గేయపురం గ్రామ మహిళలు మరుగుదొడ్ల సమస్య పరిష్కరించాలని దొడ్డి చెంబులు పట్టుకొని నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నంది విజయలక్ష్మి ,మాబ్బీ గ్రామ మహిళలు లక్ష్మి , భారతి, పార్వతమ్మ తదితర మహిళలు పాల్గొన్నారు .ధర్నా అనంతరం స్పందనలో వున్న డి.ఆర్. ఓ.కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.