బీజేపీ నేత విష్ణువ‌ర్ధన్‌కు చర్చా కార్యక్రమంలోనే చెప్పుదెబ్బ.. దేవుడా..!?

బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (23:46 IST)
Vishnu vardhan Reddy
సాధారణంగా టీవీ చర్చా కార్యక్రమాల్లో మాటల తూటాలు పేలుతాయి. మాటలు కాస్త హద్దులు దాటుతాయి. కానీ ఇక్కడ కొట్టుకోవడాల వరకు వెళ్లింది.. ఓ టీవీ షో చర్చా కార్యక్రమం. ఓ చాన‌ల్ లైవ్ షో లో.. బీజేపీ నేత విష్ణువ‌ర్ధన్‌పై.. అమ‌రావ‌తి జేఏసీ నేత చెప్పుతో దాడి చేశాడు. అంద‌రూ చూస్తుండ‌గానే ఎవ్వారం వేడెక్కింది. డిస్క‌షన్ కాస్తా.. ప‌ర్స‌న‌ల్‌గా తిట్టుకునే దాకా పోయింది. 
 
చెప్పుతో కొడ‌తా అన‌డం.. అంత‌లోనే చెప్పుతీయ‌డం.. దెబ్బ వేయ‌నే వేయ‌డం... ఇవ‌న్నీ క్ష‌ణాల్లో జ‌రిగిపోయాయి. జ‌నం షాక్ అయ్యి.. నోరెళ్ల బెట్టారు. లైవ్‌లో ఉన్న వాళ్లు.. డిస్క‌ష‌న్‌లో ఉన్న వాళ్లు.. టీవీలు చూస్తున్న వాళ్లు.. అంతా షాక్ అయ్యారు. కాసేప‌ట్లో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వీడియో క్లిప్పింగులు హాట్ టాపిక్ అయ్యాయి. 
 
సింపుల్‌గా చెప్పుకుంటే.. డిస్క‌ష‌న్ ఎప్ప‌టిలాగే.. దారి త‌ప్ప‌డ‌మే దీనికి రీజ‌న్. అఫ్ కోర్స్.. డిస్క‌ష‌న్లు దారి త‌ప్ప‌డం అనేది రెగ్యుల‌రే. కానీ ప‌క్క ప‌క్క‌నే కూర్చున్న లీడ‌ర్లు.. మాటా మాటా పెంచుకోవ‌డంతో.. ఇంత దాకా వెళ్లింది. అమ‌రావ‌తి బిల్డింగుల విష‌యంలో.. ఇవాళ ఏపీ కేబినెట్ లో తీసుకున్న నిర్ణ‌యంపై డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది. 
 
బీజేపీ లీడ‌ర్ విష్ణు.. జేఏసీ లీడ‌ర్‌ని ఒక పార్టీ వ్య‌క్తిగా మాట్లాడుతున్నావు.. కండువా క‌ప్పుకుని మాట్లాడు అనే ద‌గ్గ‌ర హీట్ పెరిగింది. విష్ణు కూడా త‌గ్గ‌కుండా ప‌దే ప‌దే రెట్టించ‌డంతో శ్రీనివాస‌రావు సీరియ‌స్ అయ్యారు. అన్న‌ట్లుగానే.. క్ష‌ణాల్లోనే చెప్పుతీసి విష్ణువ‌ర్ధన్‌ని కొట్ట‌నే కొట్టాడు శ్రీనివాస‌రావు. 
 
ఈ వ్యవహారంపై అమరావతి పరిరక్షణ సమితి నేత శ్రీనివాసరావు వివరణ ఇచ్చుకున్నారు. జగన్‌ సీఎం అయిన మొదటిరోజే అమరావతిలో నిర్మాణాలను ఆపేశారని అమరావతి పరిరక్షణ సమితి నేత శ్రీనివాసరావు ఆరోపించారు. తాను రైతులు, జేఏసీతో కలిసి పనిచేస్తున్నామని ప్రకటించారు. బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డితో తనకు గతంలో పరిచయం లేదని తెలిపారు. 
 
తాను ఎవరో తెలియకుండానే పెయిడ్‌ ఆర్టిస్ట్‌ అన్నారని, తనను టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్ట్‌ అంటూ మాట్లాడారని చెప్పారు. అమరావతి ఉద్యమంలో పెయిడ్‌ ఆర్టిస్ట్‌ అనే పదం దుర్మార్గమైనదని, ఉద్యమం చేస్తున్న రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులు అన్నారని తెలిపారు. రైతుల కోసం పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు. క్షణికావేశంలో విష్ణువర్థన్‌రెడ్డి పట్ల అలా ప్రవర్తించానని శ్రీనివాసరావు చెప్పారు. 
 
ఏడాది కాలంగా విష్ణు చేసిన వ్యాఖ్యలు తన మనసులో ఉన్నాయని, రైతుల త్యాగాలను అవహేళన చేస్తూ మాట్లాడకూడదన్నారు. ఏనాడూ ఒక కులానికి ప్రతినిధిగా మాట్లాడలేదని తెలిపారు. నిన్నటి ఘటన దురదృష్టకరమైన ఘటన అని చెప్పారు. తన మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతాననని శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు