ముగిసిన ఏపీ కేబినేట్ సమావేశం.. రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ

సోమవారం, 20 జనవరి 2020 (10:56 IST)
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలపై ఆమోద ముద్ర వేశారు. రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు.
 
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంపును ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాలకు ఆమోదం లభించింది. అలాగే 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అమరావతి ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
 
ఇంకా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆమోదం, విశాఖకు సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల తరలింపు, అమరావతిలోనే అసెంబ్లీ మూడు సెషన్లు వంటి కీలక నిర్ణయాలపై ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు