మూడు ముక్కల రాజధాని పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసానికి పాల్పడుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును నాశనం చేయడానికి, రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈజీఎస్ పథకానికి 30శాతం నిధులు తగ్గించిందని, సాల్వెన్సీస్ సర్టిఫికెట్‌లతో పారిశ్రామికవేత్తలు తీసుకున్న రుణాలను ఎగ్గొట్టేందుకు అనుకూలంగా ఉగ్ర ఆర్థిక బడ్జెట్‌ను తీసుకొచ్చిందని ఆరోపించారు.
రాజ్యాంగానికి వ్యతిరేకంగా సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ చట్టాలను తీసుకొస్తున్న నరేంద్రమోదీ, అమిత్‌షాలే దేశద్రోహులని నారాయణ అన్నారు.