పుష్ప జాతర సీన్ కు మించి కొత్తపల్లిలోఒకప్పుడు చిత్రంలో వుంది : డైరెక్టర్ ప్రవీణ పరుచూరి

దేవీ

మంగళవారం, 15 జులై 2025 (17:58 IST)
director Praveena Paruchuri
డాక్టర్, నటి, డాన్సర్, నిర్మాత, దర్శకురాలు అయిన ప్రవీణ పరుచూరి ఇంతకుముందు C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య  లో నటించి మెప్పించింది. ఈసారి  'కొత్తపల్లిలో ఒకప్పుడు' చిత్రాన్ని నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ, కీలక పాత్ర పోషించింది. రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్‌, టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రవీణ పరుచూరి సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
డైరెక్షన్ వైపు రావాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది?
-నాకు డైరెక్షన్ చేయాలని ఆసక్తి ఎప్పటి నుంచో ఉంది. చిన్నప్పుడు నుంచిసినిమాలు అంటే పిచ్చి. నేను ఆంధ్ర నాట్యం నేర్చుకున్నాను. తర్వాత కూచిపూడి. అలా నటన సంగీతం సాహిత్యం గురించి పరిచయం ఏర్పడింది. అమెరికాలో యాక్టింగ్ క్లాసెస్ కి వెళ్ళాను. అక్కడ ఫిలిం మేకింగ్ సంబంధించి ఒక షార్ట్ కోర్సు చేశాను. డైరెక్టర్ అనేది చాలా డిఫికల్ట్ క్రాఫ్ట్.  ప్రొడక్షన్ చేసి నేర్చుకోవాలని నిర్ణయించకున్నాను. నా గత రెండు సినిమాలు అన్ని క్రాఫ్ట్స్ మీద అనుభవాన్ని ఇచ్చాయి.  
 
ఈ కథ ఎలా మొదలైంది?
కరోనా సమయంలో అందరం బాధపడ్డాం. ఒక డాక్టర్ గా ఇంకా ఎక్కువ బాధ ఉండేది. ఆ సమయంలో నేను సినిమాల గురించి ఎక్కువ ఆలోచించలేదు. మరో సినిమా చేస్తానని కూడా అనుకోలేదు. అప్పుడు మిక్కీ జె. మేయర్ గారి కొలాబరేషన్ లో షార్ట్ ఫిలిం చేశాను. తరువాత ఒకసారి ఇండియాకు వచ్చాను. ఈ కథ ఆలోచన అప్పుడే పుట్టింది. ఇది కంచరపాలెం లాగానే ఒక మంచి ఎంటర్టైనర్ అవుతుందనే నమ్మకం వుంది.  
 
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?
నా క్యారెక్టర్ చాలా ఫన్ అనిపించింది. ఊర్లో ఉండే మహిళలు కాస్త టఫ్ గా ఉంటారు. నాది కూడా అలాంటి టఫ్ క్యారెక్టర్. నా పర్సనాలిటీకి చాలా డిఫరెంట్ గా ఉండే క్యారెక్టర్ ఇది. ఇందులో నాకు రెండు అద్భుతమైన సీన్స్ ఉన్నాయి. పుష్ప సినిమాలో జాతర సీన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ఇందులో అలాంటి ఒక సీక్వెన్స్ ఉంది. అది తప్పకుండా మీ అందరిని అలరిస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమాకి చాలా మంచి స్క్రీన్ ప్లే కుదిరింది. అలాగే చాలా మంచి విజువలైజేషన్ ఉంది.
 
డాక్టర్ గా బిజీగా వున్న మీకు సినిమాలు చేయాలని ఆలోచన ఎలా వచ్చింది?
డాక్టర్ గా నిరంతరం ప్రాక్టీస్ లో ఉంటాను. అలాంటి సమయంలో క్రియేటివ్ అవుట్లెట్ కావాలి. చిన్నప్పుడు నుంచి సినిమా అంటే ఆసక్తి ఉండడంతో సినిమా చేస్తే అలాంటి ఒక క్రియేటివ్ అవుట్లెట్ దొరుకుతుందని భావించాను. కంచరపాలెంకి అవసరమై యాక్టింగ్ చేశాను. ఈ సినిమాలో కూడా క్యారెక్టర్ చాలా ఫన్ గా ఉంది. అయితే నేను ఎప్పుడు కూడా డైరెక్టర్ కావాలనే అనుకున్నాను.
 
ఈ సినిమా ట్రైలర్ చూస్తే హారర్, సూపర్ నేచురల్ ఎలిమెంట్ కనిపిస్తోంది ?
హారర్ కాదు గాని ఇందులో సూపర్ నేచురల్ ఎలిమెంటు ఉంది.  మనకి చాలామంది గ్రామ దేవతలు ఉన్నారు. మనికి చాలా వాటిపై విశ్వాసం,నమ్మకం ఉంటుంది. నాకు ఈ నమ్మకాలు మీద మొదటి నుంచి చాలా ఆసక్తి. ఈ సినిమాల్లో అలాంటి ఒక నమ్మకాన్ని చాలా న్యూట్రల్ గా  చూపించడం జరిగింది.
 
-నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. ఒక మంచి కథ చెప్తే తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా గొప్ప మనసుతో చూస్తారు. ఇప్పటివరకు చేసిన రెండు సినిమాలను కూడా చాలా అద్భుతంగా ఆదరించారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారనే ఆదరించి ప్రోత్సహిస్తారనే నమ్మకం ఉంది.
 
-ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు కూడా ఉత్తరాంధ్ర నేపథ్యంలోనే చేశాను. ఇకపై ఒక సినిమా చేసే అవకాశం వస్తే సిటీ బ్యాక్ డ్రాప్ తో చేయాలని ఉంది.
 
- ఈ సినిమా ప్రివ్యూస్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిన్నపిల్లలకి  యూత్ కి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చింది. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.
 
ఈ సినిమా నుంచి మీరు ఏం నేర్చుకున్నారు?
- ఏదైనా సాధించాలంటే విల్ పవర్ ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మనం అనుకున్నది సాధించగలం. అది ఈ సినిమా నేర్పింది.
 
భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?
-ఈ సినిమా ఆడియన్స్ కి నచ్చి మంచి విజయాన్ని ఇస్తే మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. నాకు ఒక యాక్షన్ సినిమా చేయాలని కోరిక ఎప్పటినుంచో ఉంది. ఒక మంచి మార్షల్ ఆర్ట్ ఫిలిం చేయాలనే ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు