తాజాగా ఇద్దరు అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. దీంతో వారికి ఒక ఆర్నెల్ల పాటు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వీరిలో రాజంపేట సబ్‌కలెక్టర్ ఖేతన్ గర్గ్, ఏపీఎండీసీ సీపీఓ సుదర్శన్ రెడ్డిలు ఉన్నారు. ఆరు నెలల జైలుతో పాటు రూ.2 వేల అపరాధం కూడా విధించింది.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా ఓబులావారి పల్లె మండలం మంగంపేటలో 2003లో జరిగిన మైనింగ్ కారణంగా గ్రామానికి చెందిన నరసమ్మ తన ఇంటిని కోల్పోయింది. పరిహారం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించగా ఆమెకు చుక్కెదురైంది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది.