కనుమ పండుగ సంధర్భంగా నిన్న నాలుగు గ్రామాల్లో జల్లికట్టు జరిగింది. ఈ రోజు వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లి, మల్లయ్యపల్లి, డోర్నకంబాలలో జల్లికట్టు జరిగింది. కోడిగిత్తలకు కట్టిన బహుమతులను పొందేందుకు ప్రయత్నించిన యువకులకు గాయాలయ్యాయి.
పోలీసులు మొదట్లో ఆంక్షలు విధించారు. జల్లికట్టు ఆడకూడదని హెచ్చరించారు. ఏర్పాట్లు చేసుకుంటున్న నిర్వాహకులను పోలీసులు హెచ్చరించారు. అయినా గ్రామస్తులు పట్టించుకోలేదు. జల్లికట్టును కొనసాగించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మూడు గ్రామాల్లో జల్లికట్టు జరిగింది. వేలాదిమంది యువకులు జల్లికట్టును తిలకించారు.