జనసేన పార్టీ జిల్లా వ్యాప్తంగా నిర్వాహకుల ఎంపిక కోసం వినూత్న రీతిలో టాలెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఎంపికలు ఇప్పటికే పలు జిల్లాల్లో పూర్తికాగా, మరికొన్ని జిల్లాల్లో కొనసాగుతున్నాయి. అయితే, జనసేన పార్టీలో కార్యకర్తలు తప్ప నేతలు ఉండరన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కార్యకర్తల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న అధిష్టానం పార్టీ నిర్మాణంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.