ప్రత్యేక హోదాపై జనసేన టీషర్టులు.. మహాటీవీ దాడిని ఖండించిన పవన్

గురువారం, 22 ఫిబ్రవరి 2018 (16:42 IST)
ప్రత్యేక హోదాపై జనసేన ప్రచారం మొదలెట్టింది. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కార్యాచరణను రూపొందించింది. 
 
ప్రచారం ద్వారా ప్రత్యేక హోదా అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని జనసేన భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో వున్న విశ్వవిద్యాలయ విద్యార్థులకు టీషర్టులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ టీషర్టులపై ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ముద్రించారు. మరోవైపు పవన్ సూచనలతో ప్రత్యేక హోదా పోరాటానికి ముందుకు తీసుకెళ్లే దిశగా జనసేన విద్యార్థి విభాగం విధివిధానాలను రూపొందించింది. 
 
ఇదిలా ఉంటే.. తెలుగు న్యూస్ ఛానెల్ మ‌హాన్యూస్ సిబ్బంది, వాహనాలపై విజయనగరంలో దాడి జరిగినట్లు సమాచారం రావడంతో.. ఈ దాడిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ఈ మేరకు జనసేనాని ప్రెస్ నోట్ విడుదల చేశారు. 
 
మహాన్యూస్ చర్చ కార్యక్రమం నిర్వహిస్తోన్న సీఈవో మూర్తి, సిబ్బందిపై దాడికి ప్రయత్నించడాన్ని జనసేన పార్టీ ఖండిస్తోంది. ఇంకా మహాన్యూస్ వాహనాలను ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని పవన్ తెలిపారు. మీడియా స్వేచ్ఛను ప్రతి ఒక్కరు కాపాడాల జనసేన విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ లేఖలో పవన్ పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు