జాతీయ జెండాకు సెల్యూట్ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్

బుధవారం, 26 జనవరి 2022 (11:45 IST)
గణతంత్ర దినోత్సవ వేడుకలను హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్దంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్నిఎగురవేసి వందనం సమర్పించారు. 


ఈ కార్యక్రమంలో పార్టీ పి.ఏ.సి. చైర్మన్ నాదెండ్ల మనోహర్, పోలిట్ బ్యూరో సభ్యుడు అర్హమ్ ఖాన్, పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ శంకర్ గౌడ్, పార్టీ నాయకులు ఎ.వి.రత్నం,  షేక్ రియాజ్, కళ్యాణం శివ శ్రీనివాస్, రాజలింగం, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు