ఉగ్రవాదుల‌ను త‌యారు చేసే మ‌తమంటే ఖండించా : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

బుధవారం, 14 నవంబరు 2018 (12:26 IST)
హైద‌రాబాదులో ప్ర‌ముఖ నాయ‌కుడైన త‌మ్ముడు హిందు దేవుళ్ల‌ను తిడ‌తా ఉంటే ముస్లిం నాయకులు ముక్త‌కంఠంతో ఖండించాల్సింది. అలా చేయకపోవడం వల్ల ముస్లింలు అంద‌రూ ఒక్క‌టే అంటూ కొన్ని హిందు శ‌క్తులు అవ‌కాశంగా తీసుకుని రెచ్చిపోయాయి అని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు.
 
తెలుగుదేశం, వైసీపీ, జనసేన మూడు పార్టీల సిద్ధాంతాలు, విధివిధానాలు చూడండి. ఏ పార్టీ మీకు అండ‌గా ఉంటుందో ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోండి. మిమ్మ‌ల్ని నిజంగా గుండెల్లో పెట్టుకునేది జ‌న‌సేన పార్టీ అని అల్లా సంకేతాలు పంపితే జ‌న‌సేన పార్టీకే ఓటు వేయండి. మీరు ఓట్లు వేసినా, వేయ‌క‌పోయినా జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుంది అని చెప్పారు.
 
సీఎం అవ్వాల‌నే కోరిక కంటే స‌మాజంలో మార్పు తీసుకురావాల‌న్న ఆకాంక్ష బ‌లంగా ఉంది. అందులో భాగంగా సీఎం అయితే దానిని అల్లా దీవెన‌గా తీసుకుంటాను. ముస్లిం స‌మాజం నుంచి ఆడ‌ప‌డుచులు, మేధావులు బ‌య‌ట‌కు రావాల్సి ఉంది. 2019లో పార్టీ అధికారంలోకి వ‌స్తే స‌చార్ క‌మిటీ చెప్పినా చెప్ప‌క‌పోయినా జ‌న‌సేన పార్టీ మీ క‌మ్యూనిటికి అండ‌గా నిల‌బ‌డుతుంది. మోడ్ర‌న్ ఎడ్యుకేష‌న్‌తో పాటు, వారిని ఆర్థికంగా బ‌లోపేతానికి కృషి చేస్తుంది. ఆడ‌పిల్ల‌ల‌పై చేయి వేస్తే సౌదీలో అమ‌ల‌య్యే ష‌రియ‌త్ చ‌ట్టాలు వంటివి కాక‌పోయినా అటువంటి బ‌ల‌మైన చ‌ట్టాలు తీసుకొస్తామ‌”ని హామీ ఇచ్చారు పవన్ కల్యాణ్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు