29వ తేదీన జనసేన విస్తృత స్థాయి సమావేశం

సోమవారం, 27 సెప్టెంబరు 2021 (22:39 IST)
జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఈ నెల 29వ తేదీన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించాలని  పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్ణయించారు.

రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ దాష్టీకాల తదితర అంశాలపై చర్చిస్తారు. అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా  రహదారుల మరమ్మతుల కోసం జనసేన నిర్వహించే శ్రమదానం కార్యక్రమం విధివిధానాలను తెలుపుతారు.

క్షేత్ర స్థాయి నుంచీ పార్టీ చేపట్టే కార్యక్రమాలపై  పవన్ కల్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తారు. 29వ తేదీ ఉదయం 10గం.కు విస్తృత స్థాయి సమావేశం మొదలవుతుంది.

ఈ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొంటారు. పార్టీ పి.ఏ.సి. సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల చైర్మన్లు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ నుంచి గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు