సంచలనం సృష్టించిన జయరాం హత్యకేసులో సినీనటుడు సూర్యప్రసాద్‌ను, అతని స్నేహితుడు కిశోర్‌ను, సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో జయరాం హత్య విషయం గురించి ముందే తెలిసినా కూడా అంజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, హత్యకు పరోక్షంగా సూర్య, కిషోర్ సహకరించారనే విషయమై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ముగ్గురిని రేపు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.