అధికార టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం గోసిపాత కూడా ఇవ్వదని తేల్చిచెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదంటే వినరెందుకు మీరు.. ప్రత్యేక హోదా రాదు. అది నాకే కాదు.. అందరికీ తెలుసు.. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వడం కలే. ఎందుకు నన్ను పదే పదే విసిగిస్తారు. ఇది పచ్చినిజం ఆయన స్పష్టంచేశారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అయ్యా.. మైకులు తీయండి.. నేను మాట్లాడను. మాట్లాడినా ఉపయోగం లేదు. నేను మాట్లాడితే ప్రత్యేక హోదా వస్తుందా.. చెప్పండి.. రాదు. ఇప్పుడు పోరాటం చేసుకోవడం తప్ప ఇంకేం లాభం లేదంటూ వెళ్ళిపోయారు. మీరు ఎంపి కదా.. ఏం చేయబోతారు అని ప్రశ్నిస్తే ఏం చేస్తాం.. ప్రత్యేక హోదా కోసం నేనేమీ చేయాలి.. ఏమీ చెయ్యను.. ఎందుకు చెయ్యాలి. అంటూ మీడియాకే ప్రశ్నలు మీద ప్రశ్నలు వేశారు.
పైగా, 'నేను ఎవరి మాటా వినననే విషయం తెలుసు కదా? నేను ఇచ్చిన పనికి బిల్లును మంజూరు చేయాల్సిందే. ఇది పద్ధతి కాదు. ఇది మీకు తగదు' అంటూ వ్యాఖ్యానించారు. పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన ఓ రోడ్డు కాంట్రాక్టుపై వచ్చిన వివాదంలో కాంగ్రెస్ - టీడీపీ నేతలూ కల్పించుకున్నట్టు తెలుస్తోంది. వీరిమధ్య జరిగిన సంభాషణను వీడియో తీసి పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు స్పందించారు.