అరేయ్ ఎదవ పిన్నెల్లి నువ్వు ప్రజాప్రతినిధివా లేక వీధి రౌడివా! : జూలకంటి

ఠాగూర్

గురువారం, 23 మే 2024 (10:41 IST)
మాచర్ల జిల్లా పాల్వాయి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న తన ప్రత్యర్థి, వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పరుష పదజాలంతో ఆయన ట్వీట్ చేశారు. 
 
"అరేయ్ ఎదవ పిన్నెల్లి నువ్వు  ప్రజాప్రతినిధివా లేక వీధి రౌడివా" అంటూ నిలదీశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజాస్వామ్య యుతంగా జరుగుతున్న పోలింగ్ బూత్ లోకి చొరబడి అధికారుల ముందే అడ్డగోలుగా రౌడీమాదిరి ఈవీఎంలు పగలకొడుతున్నావు అంటే నీ ఓటమి తాలూకా భయం నీ నరనరాన జీర్ణించుకుని భయపడుతున్నావు అని అర్థమైంది" అన్నారు. 
 
"వ్యవస్థల పట్ల ఏ మాత్రం భయం, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు అంటే నిన్ను ఈ పోలీసు, న్యాయ వ్యవస్థలు ఏమి చేయలేవు అనే భరోసా కావొచ్చు. కానీ రేపు ప్రజా కోర్టులో ఇచ్చే తీర్పు నుండి మాత్రం తప్పించుకోలేవు అని హెచ్చరిస్తున్నా. నువ్వు ప్రతిరోజూ సత్య హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్ లా ఫోజులు కొడుతూ బల్ల గుద్దుతూ చెప్పే మాటలు అన్ని అసత్యాలు అని ప్రజలు ఏనాడో తెలుసుకున్నారు" అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు