ఆంధ్రప్రదేశ్ సర్కార్ హీరో పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసింది : టీడీపీ ఎంపీ

మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (09:27 IST)
టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌ సినిమాలను టార్గెట్ చేసిందని టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ప్రస్తావించారు. సోమవారం జరిగిన సభా కార్యక్రమాల్లో భాగంగా, ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, వైకాపా ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. 
 
రాష్ట్ర ప్రభుత్వ వ్యాపారవేత్తల సామాజిక నేపథ్యం ఆధారంగా దెబ్బతీసే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఓ పద్దతి ప్రకారం రాష్ట్రంలో వ్యాపార, పారిశ్రామిక వాతావరణాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు. ఇందుకు ఇటీవల జరిగిన సంఘటనలే అందుకు నిదర్శనమని చెప్పారు. 
 
ముఖ్యంగా ఓ ప్రాంతీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ నటించిన కొత్త చిత్రం "భీమ్లా నాయక్‌" విడుదల కావాల్సి ఉండగా, సరిగ్గా అదేసమయంలో టిక్కెట్ ధరల క్రమబద్దీకరణ అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని ఆయన సభాదృష్టికి తెచ్చారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదం అయిందని ఆ కారణంగా అనేక చిత్రాల విడుదల కాకుండా వాయిదాపడ్డాయని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు