అదే వేరే మంత్రి అయితే, మందీ మార్బలం... గన్ మెన్ లు, పార్టీ కార్యకర్తలు హడావుడి, హంగామా. అవసరం అయితే, పెద్ద సారు కోసం ట్రైన్ ని కూడా ఆపేస్తారు.
కానీ, ఇక్కడ ఇలాంటి రియల్ హీరోస్ ఉండడం వలనే మన దేశ రాజకీయ వ్యవస్థపై ఇంకా విశ్వాసం కొనసాగుతుంది. ఇలా ఉంటేనే దేశభక్తి అనడం లేదు, కానీ నేతలు మేము ప్రజాసేవకులు అని గుర్తిస్తే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. అందరికీ ఆదర్శం ఈ నేత వ్యక్తిత్వం, పార్టీలు చూడవద్దు... మనషి వ్యక్తిత్వం చూడండి...అంటూ నెట్ జన్లు జేజేలు పడుతున్నారు.