అంతర్జాతీయంగా ఖ్యాతిని సంపాదించిన కొండపల్లి బొమ్మను, దేవుని కళాకృతిని వెంకయ్యనాయుడు గారికి బహుకరించారు. వెంకయ్య నాయుడు యువతే దేశానికి వెన్నుముకని, దేశ అభివృద్ధి యువత చేతిలో ఉందని, కేశినేని శ్వేత ఈ వయసులోనే రాజకీయాలలోకి వచ్చి యువతను ప్రభావితం చేయడం ఆనందదాయకమన్నారు.
ఈ సందర్భంగా కేశినేని శ్వేత కరోనాను జయించిన ఆయన ఆత్మ విశ్వాసం అందరికి ఆదర్శనీయమన్నారు. చిన్నతనం నుండి ఆయనను చూస్తూ,రాజకీయంగా అనేక విషయాలను నేర్చుకున్నామని, పలు అంశాలను ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్ళారు.