యువత స్వశక్తితో ఇతరులకు ఆదర్శంగా ఉండాలి: ఉప రాష్ట్రపతి

సోమవారం, 28 డిశెంబరు 2020 (19:43 IST)
యువత బహుముఖమైన వృత్తి నైపుణ్యాన్ని సాధించి తద్వారా స్వశక్తితో ఇతరులకు ఆదర్శంగా ఉండాలని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ  పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి స్కిల్ డెవలప్ మెంట్ కోర్సుల్లో నైపుణ్యతను సాధించి స్వశక్తితో విలబడాలన్నారు. రానున్న 2021 మాతన సంవత్సరంలో సంక్రాంతి ప్రజలకు సన్యక్రాంతినిస్తూ వెలుగులు నింపాలని అన్నారు. కోవిడ్ మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ బౌతిక దూరాన్ని పాటించాలన్నారు.
$
చాలా కాలంగా బౌతికంగా మీ అందరిని కలుసుకోనప్పటికీ వర్చువల్ విధానంలో అంతర్జాలం ద్వారా గోష్టులు నిర్వహిస్తున్నానన్నారు. 1977 నుండి ప్రజా జీవనం సాగిస్తున్నానని గత మూడు సంవత్సరాల నుండి ఉప రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టి రాజ్యాంగ బద్దంగా రాజకీయాలకు దూరంగా ఉండవలసిన బాధ్యత ఉందన్నారు.

నా దృష్టికి వచ్చిన ప్రతి విషయాని  ప్రభుత్వాధికారుల దృష్టికి తెలియజేస్తానన్నారు . భవిష్యత్ యువతరం ఆధ్యాత్మిక, సామాజిక సేవకులుగా, కార్యకర్తలుగా విద్యారంగంలో , వ్యవసాయరంగంలోని రైతులను కలుసుకొని పలు సూచనలు చేయడం జరుగుతుంది. ఐఐటి,  ఏయంలు, ఇఎస్ఆర్, సీపెట్ దేశవ్యాప్తంగా ఉన్నాయన్నారు.

2016 లో సీపీట్ కంపెనీ సంస్థ వచ్చేందుకు కృషి చేసి శంఖుస్థాపన చేసుకోవడం జరిగిందని, సూరంపల్లిలో ఉన్న సీపెట్ పురోగతి , ప్రగతిని ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. యువత దేశ భవిష్యత్ పునాది వంటి వారవి దేశానికి అన్నం పెట్టే రైతు విజయవంతంగా ముందుకు వెళ్లారంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు.

తాను కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు, అండమాన్ మండి అస్సాము వరకు అన్ని ప్రదేశాల్లో పర్యటించడం జరిగిందన్నారు.   కరోనా ఉధృతి తరువాత ఆంధ్రప్రదేశ్ లో నేరుగా ముఖాముఖి కార్యక్రమంలో కలుసుకోవడం ఇది రెండవసారని విశాఖపట్నంలో మత్స్య పరిశ్రమ రైతుల సమావేశంలో పాల్గొనడం జరిగిందని, నేడు సూరంపల్లిలో నెలకొన్న సీపెట్ పురోగతిని గమనించడం జరిగిందన్నారు. పుట్టిన ఊళ్లకు మేలు చెయ్యాలనే లక్ష్యంగా మహాత్మా గాంధీ ఆ రోజుల్లోనే గ్రామాలకు రండి అనే పిలుపునిచ్చారన్నారు.

2001 లో స్వర్ణభారతి ట్రస్టు నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగిందని తదుపరి తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోను, విజయవాడలోను విస్తరించడం జరిగిందన్నారు. స్వర్ణభారతి ట్రస్టు ద్వారా యువతకు విద్యా, వైద్య, సాంకేతిక, వ్యవసాయ కార్యక్రమాల్లో శిక్షణలను అందిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పథంలో భారతదేశం ముందుకు వెళ్తుందని అన్నారు.

దేశంలో 50 శాతం మహిళలు స్వావలంబన స్వశక్తి పై ఆధారపడి ముందుకు వెళ్తున్నారన్నారు. ప్రభుత్వాలతోపాటు ప్రైవేటు, స్వశక్తి సంస్థలు కూడా అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తి సాధికారత, అభివృద్ధి ఫలాల్లో భాగస్వామ్యం కావాలని ఉచిత పథకాలకు ఆకర్షితులు కాకుండా స్వశక్తితో విలబడేందుకు కృషి చేయాలన్నారు.

అధికార పార్టీలు శాశ్వత ప్రణాళికలు రూపకల్పన చేయాలన్నారు. పథకాలను ప్రారంభించి అర్హులకు అందేలా చూడాలన్నారు. మహమ్మారి కోవిడ్ విషయంలో బ్రిటన్, ఫ్రాన్స్ , అమెరికా దేశాలు అతలాకుతలమైనప్పటికీ భారత దేశం  వైరస్ నియంత్రణలో చాలా బెటర్ గా ఉందన్నారు.

యువత కౌసల్య శిక్షణ యోగా వంటి కార్యక్రమాలను రోజుకు ఒక గంట పాటు తప్పని సరిగా చేస్తూ  ఆరోగ్యంగా ఉండాలన్నారు . భారతీయ వంటకాలనే తినేందుకు మొగ్గు చూపాలని ఫర్జా , బర్గ్ వంటి పాస్టు వు ఫుడ్లను దూరంగా ఉంచాలన్నారు.

పూర్వీకులు చలికాలం , ఎండాకాలం , వర్షాకాలంలో ఎటువంటి ఆహార పదార్థాలు తివాలో చెప్పారని, దానిని మనం పాటిస్తూ పాశ్చాత్య దేశాలు ఆహారపు అలవాట్లను దూరంగా ఉంచాలన్నారు. విజయమంటే సంతోషమని ఆధ్యాత్మిక శక్తి వస్తుందని మతాలతో ఏదీ ముడి పెట్టకూడదన్నారు. భారత జాతి జీవన విధానం మన పెద్దలు కొన్ని ఎళ్లుపాటు  జీవించి మనకు సంస్కృతిని, సంప్రదాయాన్ని, జీవన విధానాన్ని అందించారన్నారు.

ఒకపూట అన్నం పెట్టడం కంటే అన్నం సంపాదించుకొనేందుకు నైపుణ్యత తో కూడిన శిక్షణ అందిస్తే స్వశక్తితో నిలబడతాడన్నారు . ప్రపంచ కంపెనీల్లో భారతదేశం నుండి వెళ్లిన ఉద్యోగులు ఆయా కంపెనీలకు ప్రధాన ఉద్యోగులుగా స్థిరపడ్డారన్నారు . తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆడపిల్లలను చదివించలేక పోతున్నారని ఆసక్తిగల ఆడపిల్లలకు స్వర్ణభారతి ట్రస్టు ద్వారా శిక్షణను అందిస్తే వారు ఆర్థికంగా బలోపేతం చెందుతారన్నారు.

భారత దేశంలో 60 శాతం నుండి 70 శాతం వరకు ఆడ పిల్లలో మంచి నాలెడ్జి ఉందని వారికి ప్రోత్సహన్ని అందిస్తే రాణిస్తారన్నారు . దేశవ్యాప్తంగా వర్చువల్ ప్రాగ్రాంలు చేస్తున్నా వేరుగా వచ్చి మీ అందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

మనమందరం మహా కార్యక్రమాలు చేయడానికి ఉన్నామనుకుంటూ జీవించాలని ఎటువంటి సమస్యలు వచ్చినా అధైర్య పడకూడదని, అప్పుడే ఘనమైన ఫలితాలు వస్తాయని స్వామి వివేకానందా తెలిపారన్నారు . కరోనా వైరస్ ఇంకా పోలేదని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, శానిటైజరు వినియోగిస్తూ శారీరక శ్రమ చేస్తూ బౌతిక దూరాన్ని పాటిస్తూ జీవనం సాగించాలని ఈ సందర్భంగా భారత ఉప రాష్ట్రపతి గౌ . ముప్పవరపు వెంకయ్యనాయుడు సందేశాన్ని ఇచ్చారు.

కార్యక్రమంలో తొలుత స్వర్ణభారతి ట్రస్టు డైరెక్టరు పరదేశి ట్రస్టు నిర్వహించే కార్యక్రమాలను వివరిస్తూ నాలుగు సంవత్సరాలుగా స్వర్ణభారతి ట్రస్టునుండి యువతతో వివిధ వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణను అందిస్తున్నామని శిక్షణ పూర్తి చేసుకున్నవారికి నేడు భారత ఉపరాష్ట్రపతి గౌ. శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో సర్టిఫికెట్లను అందిస్తున్నామన్నారు.

కోరోనా సమయంలో లాక్ డౌన్ కాలంలో 45 రోజులు పాటు స్వర్ణభారతి ట్రస్టు ద్వారా పేదలకు ఆహార పొట్లాలను అందజేశామన్నారు . సంక్రాంతి అనంతరం యధావిధిగా వృత్తి విద్యాకోర్సులో విద్యార్థులకు శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు . కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి కార్యాలయ సిబ్బంది , స్వర్ణభారతి ఉద్యోగులు , శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్ధులు , అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు . 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు