వైకాపాకు చెందిన శివప్ప, ఈరన్నలతో బీజేపీకి చెందిన మల్లిఖార్జునకు ఓ భూవివాదం ఉంది. వీరిలో శివప్ప వర్గం వైకాపాలో, మల్లిఖార్జున వర్గం బీజేపీలో ఉన్నారు. అయితే, భూగొడవ విషయంలో మాట్లాడేందుకు గురువారం ఉదయం ఇరు వర్గాలు సమావేశమయ్యాయి.
ఈ సమావేశం కాస్త రసాభాసగా మారింది. చివరకు ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మల్లిఖార్జున వర్గం నేతలు శివప్ప, ఈరన్నలపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో కామవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.