ఇటీవలి కాలంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావివరుసలు మరిచిపోతున్నారు. భార్యాభర్తల బంధం అంతకంటే దారుణంగా తయారైంది. తాజాగా ఓ భార్య కట్టుకున్న భర్త జీవించివుండగానే, చనిపోయినట్టు అధికారులను నమ్మించింది. అదీ వితంతు పెన్షన్ డబ్బుల కోసం ఈ ఘరానా మోసానికి పాల్పడింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బొల్లవరం గ్రామానికి చెందిన ఓ మహిళ డబ్బులకు కక్కుర్తిపడి ఈ ఘాతుకానికి పాల్పడింది. తన భర్తను కూలి పనుల కోసం ముంబైకు పంపించింది. దీంతో ఆయన కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నారు. ఈ విషయాన్ని అధికారులను నమ్మించి వింతంతు పెన్షన్ తీసుకుంటూ వస్తోంది.