కర్నూలుకు చెందిన ఐదుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరందరూ స్నేహితులే. డిగ్రీ వరకు చదువుకున్న ఈ బ్యాచ్ సులువుగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశారు. నిరుద్యోగ యువకులతో ఫ్రెండ్‌షిప్ ఏర్పరచుకుని ఉద్యోగం తీసిస్తానని నమ్మిస్తారు. ఆ తరువాత వారికి మొబైల్స్ తీయించి బాగా డబ్బున్న మీ స్నేహితులతో మాట్లాడమని చెబుతారు.
ఆ తర్వాత వీరే రంగంలోకి దిగి పదిరోజుల పాటు బాగా చనువుగా మాట్లాడతారు. ఇలా పదిమంది యువతులు కలిసి ఇప్పటికే 20 మందిని యువకులను మోసం చేశారు. యువతులు పిలిస్తే వెళ్ళకుండా ఉంటారా.. ఠక్కున వెళ్ళడం.. గదికి వెళ్ళిన తరువాత బట్టలు తీసేసి ఏదో చేయాలని ముందుకు వెళ్లబోవడం. అంతే.. అక్కడే ఆపేసి, నేను కావాలంటే కొన్ని షరతులున్నాయి.
బ్లాంక్ చెక్ ఇవ్వు, అది లేదంటే ఇదిగో ఈ ప్రామిసరీ నోటుపైన సంతకం చేయి అని మత్తుగా అడిగేసరికి వారు కాస్తా సంతకాలు చేసేస్తారు. ఈలోపు అటు పక్కనే వున్న మరికొందరు యువతులు అండర్‌వే పైన వున్న యువకుల ఫోటోలను లాగేస్తారు. సదరు కుర్రాడు గది లోపలికి వెళ్లబోతే... చెక్ పైన రాసిన అమౌంట్ వచ్చాక చూద్దాంలే అని పంపేస్తారు. ఆలోపు డబ్బు ఇవ్వకపోతే.. ఆ యువకుడు నగ్న ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టారు.
ఇలా కొంతమంది యువకుల నుంచి ప్రామిసరీ నోట్లు, ఐదు చెక్కులు, 8 లక్షల రూపాయల విలువచేసే నగలు, 18 లక్షల రూపాయల నగదును తీసుకున్నారు. డబ్బున్న యువకులు తమ అర్థనగ్న ఫోటోలు బయటకు వస్తే ఎక్కడ పరువుపోతోందోనని.. ఇంట్లో వారు ఎలా స్పందిస్తారోనన్న భయంతో ఈ ముఠా అడిగినంత డబ్బులు ఇచ్చేసారు.