లగడపాటి పొలిటికల్ రీఎట్రీతో గల్లా జయదేవ్‌కు చెక్.. చంద్రబాబు వ్యూహం!!

ఆదివారం, 11 జూన్ 2017 (14:17 IST)
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ ఎంట్రీకి ముహుర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయనున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన లగడపాటి.. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 
 
అయితే, ఇటీవల ఆయన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. అప్పటి నుంచి లగడపాటి పొలిటికల్ ఎంట్రీ రకరకాలైన ఊహాగానాలు వస్తున్నాయి. వీటిని టీడీపీ శ్రేణులు ఎప్పటికపుడూ ఖండిస్తున్నా... లగడపాటి అనుచరులు మాత్రం నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో లగడపాటి టీడీపీ తరపున బరిలోకి దిగడం ఖాయంగా తెలుస్తోంది. 
 
అయితే, లగడపాటి పోటీ చేస్తే మాత్రం వియవాడ నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ స్థానం నుంచి ప్రాతినిథ్యం గల్లా జయదేవ్‌కు చెక్ పెట్టినట్టే అవుతుంది. మరోవైపు లగడపాటి రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు నినాదాలు చేస్తున్నారు. అయితే, ఇదంతా రాజకీయ రంగంలోకి మళ్లీ దిగే వ్యూహంలో భాగమే కావొచ్చునని అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి