లగడపాటి రాజగోపాల్. ఎక్కడ ఎన్నికలు జరిగినా వెంటనే ఒక సర్వే చేసి ఫలితాలను ముందే చెప్పేస్తుంటారు. గతంలో కూడా ప్రధాన ఎన్నికలపై సర్వే నిర్వహించిన లగడపాటి కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది, తెలుగుదేశంపార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పాడు. అంతేకాదు ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపిల సీట్లపై కూడా స్పష్టమైన సంఖ్యను కూడా ఇచ్చారు.
కానీ తాజాగా తన స్నేహితులతో నంద్యాల ఉప ఎన్నికలపై సర్వే చేశారట లగడపాటి. ఉప ఎన్నికల్లో వైసిపి విజయం ఖాయమని తేల్చేశారట. ఇదే విషయాన్ని తన సన్నిహితుల ద్వారా అందరికీ సమాచారం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా సర్వే చేయించిన లగడపాటి ఈ నిర్ణయాన్ని ప్రకటించారట. లగడపాటి సర్వేతో టిడిపి ఆలోచనలో పడింది.