అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపులలో కలెక్షన్స్‌లోనూ దోపిడీ చేశారని తెలిపారు. ప్రభుత్వం వేసిన రోడ్లను తవ్వి కంకర దోపిడీ చేశారని... వీటితో పాటు యెదేచ్ఛగా ఇసుక, సహజవనరులను దోపిడీ చేస్తూ పాలన పాపాలతో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంతో దోపిడీకి లైసెన్సు వచ్చేసింది అని జగన్ అనుకుంటున్నట్లు ఉందన్నారు. 2019 ముందు నంద్యాల, కాకినాడ కార్పోరేషన్ ఏన్నికల విజయాలు వంటివే నేటి స్థానిక సంస్థల ఏన్నికల ఫలితాలు అని లంకా దినకర్ వ్యాఖ్యానించారు.