సాధారణంగా బ్యాటరీలలో జింకు, రాగి లోహపు పలకలను వాడతారు. వీటిని ఎలక్ట్రాన్లు సులువుగా ప్రవహించే ద్రవంలో ఉంచుతారు. వీటి మధ్య జరిగే రసాయనిక చర్యల ఫలితంగా ఎలక్ట్రాన్ల ప్రవాహం మొదలై ఎక్కువ మోతాదులో రాగి పలకపైకి చేరుకుంటాయి.
ఇవే బ్యాటరీని అనుసంధానం చేసిన విద్యత్ వలయంలో కూడా ప్రవహిస్తాయి. చలికాలంలో, వర్షాకాలంలో వాతవతరణంలో ఉండే చల్లదనం వల్ల ఉష్ణోగ్రత తగ్గి రసాయనిక చర్య వేగం మందగించడంతో బ్యాటరీలలో ఎలక్ట్రాన్ల ప్రవాహం తక్కువగా ఉంటుంది.