పవన్ ప్రకటనతో వామపక్షాల నోట్లో పచ్చివెలక్కాయ్, పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరుకుతారా?

బుధవారం, 2 మే 2018 (13:29 IST)
ఇంతకాలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వామపక్ష పార్టీ నేతలు కలిసి ప్రత్యేక హోదా కోసం పాదయాత్ర చేయడం, జె.ఎఫ్.సి సమావేశాల్లో  వామపక్షాల నాయకులు పాల్గొనటం తదితర కారణాలు వల్ల  జనసేన, వామపక్షాలు పొత్తు పెట్టుకుంటారని భావించారు అంతా. అయితే తాజాగా 175 సీట్లకు జనసేన పోటీచేస్తుందని, అందుకు తగిన విధంగా పార్టీని నిర్మిస్తామని పవన్ ప్రకటించడం ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? ఉండదా? అనేది సర్వత్రా చర్చ నడుస్తోంది.
 
తాజాగా పవన్ ప్రకటనపై వామపక్షాల నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడిన చందంగా తయారైందని అంటున్నారు. దీనిపై రెండుమూడు రోజుల్లో  వామపక్ష నేతలు పవన్‌తో భేటీ అవుతారని సమాచారం. మరోవైపు జనసేనకు 175 సీట్లలో పోటీ చేసేందుకు అసలు అభ్యర్థులు దొరుకుతారా అంటూ వైరి వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు