ఇప్పటికే కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. విజయం కోసం వివిధ పార్టీల అభ్యర్థులు చెమటోడుస్తున్నారు. ప్రధాని మోదీ కూడా కర్ణాటకలో వరుసగా సభలు పెడుతున్నారు. కానీ కర్ణాటకలో ఏ పార్టీకి అధికారం రాదని పోల్ సర్వేలు తెలిపాయి. కర్ణాటకలో హంగ్ తప్పదని పలు సంస్థలు తమ సర్వే రిపోర్టులో వెల్లడించాయి. కానీ సీ ఫోర్ సర్వే మాత్రం కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు వస్తాయని చెబుతూ బీజేపీకి షాకిచ్చింది.
రాష్ట్రంలోని 165 నియోజకవర్గాల్లోని 24,679 మంది ఓటర్లను సర్వే చేస్తూ సీ ఫోర్ ఫలితాలను తెలిపింది. 2017లో 340 పట్టణాలు, 550 గ్రామాలకు చెందిన అన్ని కులాల వారినీ తమ తొలి సర్వేలో భాగం చేస్తూ, కాంగ్రెస్‌కు 120 నుంచి 132 సీట్లు వస్తాయని సీ ఫోర్ తెలిపింది. ఇక, బీజేపీకి 60 నుంచి 72 సీట్లు, జేడీఎస్‌కు 20 నుంచి 30 సీట్లు, ఇతరులకు 1 నుంచి 7 సీట్లు వస్తాయని అంచనా వేసింది.