తిరుమలలో జంతువుల సంచారం ఎక్కువగా కనబడుతోంది. నిత్యం రద్దీగా వుండే తిరుమల గిరులు భక్తులు లేక ఖాళీగా వుండటంతో జంతువులు యథేచ్ఛగా తిరిగేస్తున్నాయి. జింకలు, అడవిపందులు, చిరుతలు ఇలా తిరుమలలో జనం తిరిగే ప్రాంతంలోనే ప్రత్యక్షమవుతున్నాయి.
ఇది కాస్త స్థానికులకు, భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చిరుతను దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు అటవీశాఖాధికారులు ప్రయత్నం చేశారు. కానీ చివరకు చిరుత జాడను గుర్తించలేకపోయారు. తాజాగా చిరుత తిరుమలలో మళ్ళీ ప్రత్యక్షమవడం.. అది కాస్తా సిసి.టివి ఫుటేజ్‌లో బయట పడటంతో భక్తుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.