శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి కలకలం.. పూజారి ఇంట సంచారం (video)

సెల్వి

సోమవారం, 6 జనవరి 2025 (13:34 IST)
Leopard
శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుతపులి కలకలం రేపింది. పాతాళగంగలోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో చిరుత సంచరించింది. చిరుత తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 
 
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరుత పులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కొద్ది నెలలుగా శ్రీశైలం పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు తెలిపారు. 
 
కృష్ణా, అనంతరపురం జిల్లాల ప్రజలను చిరుతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గన్నవరం మండలం మెట్లపల్లి శివారులో ఆదివారం ఉదయం పులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. మెట్లపల్లి సమీపంలోని ఆయిల్ పామ్ తోట వద్ద చిరుత సంచరించినట్లు ఆర్టీసీ బస్ కండక్టర్ రవికిరణ్ తెలిపారు.
 
అలాగే పెద్దపులి సంచరిస్తుందన్న వార్త మెట్లపల్లి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలను హడలెత్తిస్తోంది. మరోవైపు అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. రాజన్న అనే రైతు పొలంలోని రెండు ఆవు దూడలపై పులి దాడి చేసి చంపేసింది. 

VIDEO: శ్రీశైలంలో చిరుత పులి కలకలం

శ్రీశైలంలో చిరుత పులి కలవరపెడుతోంది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంట్లో అర్ధరాత్రి చిరుత సంచరించడం కలకలం రేపింది. రాత్రి చిరుత ఇంట్లోకి వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను ఉదయాన్నే చూసిన పూజారి కుటుంబం షాక్కు గురైంది.… pic.twitter.com/4Vkgg44KHj

— Swathi Reddy (@Swathireddytdp) January 6, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు