ఈ నేపథ్యంలో తాజాగా గురువారం రంపచోడవరం డివిజన్ మారేడుమిల్లి గ్రామ శివారు ప్రాంతాల్లో మారేడుమిల్లి పోలీస్ ఎస్.ఐ. డి.రామకృష్ణ సిబ్బందితో కలసి వాహనాల తనిఖీలు చేస్తుండగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాటవరం గ్రామం నుండి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం ప్రాంతానికి ఏపి05టిడి9776 నెంబర్ గల మహేంద్ర మ్యాక్షి సుప్రో ట్రక్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 1820 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ సుమారు రూ.2,15,440 ఉంటుందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ, ఆలమూరు ప్రాంతానికి చెందిన సిద్దిన చంద్రశేఖర్ (32) అదే ప్రాంతానికి చెందిన సుంకర నాగబాబు (32) నిందితులను అరెస్ట్ చేశారు.