ఈ రోజు హైదరాబాద్లో ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ముహూర్తపు షాట్‌కు నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టారు. దర్శకుడు బుచ్చి బాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేయగా, గుణ్ణం సందీప్, నాని, రమ్య గుణ్ణం స్క్రిప్ట్‌ను టీంకు అందజేశారు. ఫస్ట్ షాట్‌ను రవి నెలకుడిటి స్వయంగా దర్శకత్వం వహించారు. దసరా, ది ప్యారడైజ్ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం అవుతుంది.
తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, తమిళ భాషలలో విడుదల కానున్న ఈ సినిమా గురించి త్వరలో మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. ఈ చిత్రానికి అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు, జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.