తాత తారకరాముడి మాట, నాన్న నారా చంద్రబాబు బాటలో రాజకీయరంగంలో ప్రవేశించిన నారా లోకేశ్ ని తప్పుపట్టేందుకు ప్రత్యర్థులకు ఏ ఒక్క చిన్న అవకాశం దొరకకపోవడంతో తడబడే మాటల్ని పట్టుకుని పప్పు అంటూ ఎద్దేవ చేసేవారు.
ఇది కూడా నిజాయితీ ఒప్పుకున్న లోకేశ్..యెస్ నేను తెలుగు ఒక పదం అటూ ఇటూ వేస్తాను కానీ, తప్పుడు పనులు మాత్రం చేయనంటూ చెప్పుకొచ్చారు. ఎంత వెదికినా తప్పులు దొరకపోయేసరికి ఈ సారి లోకేశ్ వెయిట్‌ని దృష్టిలో పెట్టుకుని బాడీ షేమింగ్‌కి పాల్పడ్డారు. దీన్ని కూడా పాజిటివ్‌గా తీసుకోవడం లోకేశ్‌కే చెల్లింది.
సంక్షోభాల్ని అవకాశాలుగా మలుచుకుని ప్రజల సంక్షేమానికి పాటుపడే తండ్రి చంద్రబాబు మాదిరిగానే బాడీషేమింగ్ ప్రచారాన్ని చాలెంజ్‌గా తీసుకున్నారు. కరోనా లాక్‌డౌన్ టైములో హైదరాబాద్‌లో ఇరుక్కుపోవడంతో కఠోర వ్యాయామం, మితాహారం తీసుకుంటూ ఎక్కడ తగ్గాలో తెలుసుకుని 20 కేజీలు తగ్గి చూపించారు.
మంత్రిగా మూడుశాఖలు నిర్వహించి వందల అవార్డులు సాధించిన ఘనత, కెరీర్ మొత్తం మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా చేయలేనంత పారదర్శకత పాటించిన లోకేశ్... తన తప్పులేని తెలుగు భాషతడబాటు, బాడీ షేమింగ్తో ప్రత్యర్థులు దాడి చేస్తుండటాన్ని పాజిటివ్‌గా తీసుకుని మరీ తెలుగులో చక్కగా మాట్లాడటం నేర్చుకున్నారు.
రెండు నెలల లాక్‌డౌన్ కాలంలో వర్కవుట్స్, డైట్‌తో భారీగా వెయిట్ తగ్గి చూపించారు. కార్యకర్తల సంక్షేమవిభాగం కన్వీనర్‌గా వేలాదిమందిని ఆదుకుని పార్టీ నేతగా, సోషల్ మీడియా కార్యకర్తల్ని అక్రమంగా అరెస్టు చేస్తుంటే వారికి అండగా నిలిచిన యువనేతగా, మంత్రిగా మూడు శాఖలపై చెరగని ముద్రవేసిన పాలనాదక్షుడిగా నిరూపించుకున్న నారా లోకేశ్.. ప్రత్యర్థులు తనవైపు వేలెత్తి చూపని విధంగా విమర్శల్ని కూడా హుందాగా స్వీకరిస్తూ పరిపూర్ణ నాయకుడిగా తనని తాను తీర్చిదిద్దుకుంటున్నారు.