పోలవరం ప్రాజెక్టు రీ టెండరింగ్ విధానానికి శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. శనివారం నుండి టెండర్ ప్రక్రియ కొనసాగించనుంది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబునాయుడు సర్కార్ తీసుకొన్న నిర్ణయాల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయని ఆ పార్టీ నేతలు, మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ తరుణంలో ప్రాజెక్టు పనులను రివర్స్ టెండరింగ్ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఈ మేరకు మార్గదర్శకాలను కూడ విడుదల చేశారు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ నిర్వహించడం వల్ల నష్టమని పీపీఏ అభిప్రాయడింది. శుక్రవారం నాడు ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖాధికారి ఆదిత్యనాథ్ దాస్ కు పీపీఏ సీఈఓ ఆర్ కే జైన్ లేఖ రాశారు.