ప్రేమ వివాహం.. సంవత్సరం తిరగకుండానే యువతి ఆత్మహత్య..

ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (12:35 IST)
ప్రేమ వివాహం చేసుకున్న యువతి సంవత్సరం తిరగకుండానే ఆత్మహత్య చేసుకున్న ఘటన పుంగనూరు పట్టణంలోని రాగానిపల్లెలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన తేజశ్వని (20) అనే యువ‌తి తిరుపతిలో ఉన్న తన బంధువుల ఇంటికి పదే పదే వెళ్లేదని, ఈ క్రమంలో పుంగనూరుకు చెందిన యువ‌కుడు ప్రశాంత్‌పాల్‌తో ప్రేమ‌లో ప‌డింద‌ని తెలిపారు. 
 
వీరిద్ద‌రూ గ‌త ఏడాది పెళ్లి చేసుకొని పుంగనూరులో ఉన్నారు. అయితే, పెళ్లయిన కొన్ని నెలల నుంచే వీరిద్ద‌రి మధ్య తీవ్ర మనస్పర్ధలు వ‌చ్చాయ‌ని తెలిపారు. రెండు రోజుల క్రితం తన భర్త ప్రశాంత్‌పాల్‌కు ఫోన్ చేసిన తేజశ్విని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిందని పోలీసులు తెలిపారు. ప్రశాంత్ ఇంటికి చేరుకునే పురుగుల మందు తాగేసిందని.. ఆస్పత్రిలో చేర్చేందుకు ముందే చనిపోయింది. 

వెబ్దునియా పై చదవండి