ప్రేమ ముసుగులో మహిళలను వేధింపులకు గురిచేసే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రేమ పేరిట వంచించడం.. కట్నం కోసం వేధించడం ఎక్కువైపోయింది. తాజాగా పదేళ్ల పాటు ప్రేమ.. ఆపై సహజీవనం చేసిన జంట విడిపోయింది. ఇందుకు కారణం ఏమిటో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతి పదేళ్లు గుంటూరులో చదువుకుంది.
ఆమెకు ఆ ప్రాంతానికి చెందిన పాపయ్య అలియాస్ డేవిడ్ పరిచయయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొద్ది రోజుల నుంచి ఇద్దరూ కలిసి నగరంలో ఒకే ఇంట్లో ఉంటున్నారు. కాగా పెళ్లికి ముహూర్తం ఖరారు కాకున్నా.. వివాహం కోసం మూడు లక్షల నగదు, ఐదు తులాల బంగారం పెడతామని అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి చెప్పారు. అయితే పది రోజుల నుంచి పాపయ్య కనిపించకుండా పోయాడు.