బంగాళాఖాతంలో అల్పపీడనం - ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

సోమవారం, 19 సెప్టెంబరు 2022 (14:29 IST)
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య, పశ్చిమ ధ్య బంగాళాఖాతాల్లో ఈ అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
బంగాళాఖాతంలో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, తాజాగా వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఉత్తరాంధ్రలోని అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
కోస్తాంధ్రలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేసమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయని, ఇవి మరో మూడు రోజుల్లో ముగిసిపోతాయని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు