ప్రకాష్ రాజ్, నాగబాబు రాజీనామాలను తాను ఆమోదించబోనని మా అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పారు. ప్రకాష్ రాజు ఐడియాలు, వారి అనుభవం తనకు కావాలని అన్నారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన ప్రకాష్ రాజ్ కు, ఆయన ప్యానెల్ సభ్యులకు సూచించారు. తెలుగువాడు కాదు...నాన్ తెలుగు అనే ప్యాక్టర్ ప్రకాష్ రాజ్ ను ఓడగొట్టింనేది తాను నమ్మను అని విష్ణు చెప్పారు. 250 మంది వరకు తెలుగు వాళ్లు ఓట్లేసి ప్రకాష్ రాజ్ కావాలని కోరారని విష్ణు చెప్పారు. శ్రీకాంత్ తో కలిసి పనిచేస్తానిని మంచు విష్ణు అన్నారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా దానిపై రచ్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల తర్వాత ప్రకాష్ రాజ్ తాను మాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే నాగబాబు, ఇతర నటులు కొందరు తాము రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే, దీనిపై మంచు విష్ణు మాత్రం చాలా పరిపక్వతగా కామెంట్ చేశారు. వారి సేవలు మాకు కావాలని వివరించారు.
మరో పక్క మంచు విష్ణు చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తనను సైడ్ అవ్వమని చెప్పారని, విత్ డ్రా చేసుకోమన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చెప్పకూడదని అనుకున్నప్పటికీ ఎన్నికలు ముగియడంతో చెప్పా అని సంచలన విషయాన్ని బయటపెట్టారు. రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడే అయినా, తన ఓటు ప్రకాష్ రాజ్ కే వెళ్లిందని అన్నారు. ప్రకాష్ రాజ్, నాగబాబు రాజీనామాలను తాను ఆమోదించబోనన్నారు. హీరో శ్రీకాంత్ తో కలిసి తాను పని చేస్తానని మంచు విష్ణు అన్నారు.