అక్కినేని ఆస్పత్రిలో ఈడీ సోదాలు.. సీఎండీ మణి వద్ద విచారణ

శుక్రవారం, 2 డిశెంబరు 2022 (16:58 IST)
విజయవాడ నగరంలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆస్పత్రి సీఎండీ మణిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. గత ఆగస్టు నెలలో ఈ ఆస్పత్రి ప్రారంభంకానా, వైద్య సీట్ల భర్తీలో భాగంగా మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం భారీ మొత్తంలో నిధులు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 
 
ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు, నిధుల మళ్లింపుపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎన్నారై, మేనేజ్‌మెంట్ కోటాల్లో వైద్య సీట్ల కేటాయింపుల్లో భారీ మొత్తంలో నిధులు వసూలు చేసినట్టు ఈడీ అధికారులకు సమాచారం ఉన్నట్టు వినికిడి. ఈ కారణంగానే ఈడీ అధికారులు శుక్రవారం ఈ ఆస్పత్రిలో సోదాలకు దిగింది. 
 
ఆస్పత్రి చుట్టూత సీఆర్పీఎఫ్ బలగాల భద్రతను కల్పించారు. ఆస్పత్రిలో పని చేసే ప్రధాన సిబ్బంది మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రిలోకి ఎవరినీ అనుమతించకుండా ఈడీ అధికారులు గట్టి భద్రతను కల్పించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు